



స్ఫూర్తిగా నిలుస్తున్న రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ
జనం న్యూస్ పీబ్రవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న.. సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేసే మనస్సు’ అన్న సేవామూర్తి మదర్ థెరిస్సా సూక్తులను స్ఫూర్తిగా తీసుకున్నారు ఉపారపు సత్యరాజ్. తన చుట్టూ సమాజంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, మహిళలపై హింస- వేధింపులు వంటి సమస్యలు తాండవిస్తున్న క్రమంలో తన వంతుగా సమాజానికి ఎంతోకొంత చేయాలనే తపనతో అయన ముందుకు సాగుతున్నారు. గత కొన్నేళ్లుగా అయన అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.మూడేళ్ళ క్రితం రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి సామజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలో సాధారణ కుటుంబం లో జన్మించిన ఉపారపు సత్య రాజ్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం. ఏ బి. ఎడ్ పూర్తి చేశారు సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సామాజిక సేవను అలవార్చుకున్నారు ఆర్థికంగా వెనుకబడిన గిరిజన, దళిత విద్యార్థులు ఉన్నత చదువులు చదివేల గురుకుల ప్రవేశల పరీక్షలను ప్రోత్సహించే వారు చదువు మధ్యలోనే ఆపేసిన పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలు, కళాశాలలకు తిరిగి పంపించేలా ప్రోత్సహించారు.వికలాంగులను ఆదరించి వారికి ఆర్థికంగా సహాయపడుతూ చదువులో మరింతగా ప్రోత్సహించారు . సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించటానికి రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపనకు పూనుకున్నారు. చిన్నప్పటి నుంచి సేవాభావం
కల్గిన సత్యరాజ్ ఉపారపు తన తల్లి జ్ఞాపకార్థం రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి వివిధ సామజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మోటివేషన్ స్పీకర్ గా ఇంపాక్ట్ మోటివేషన్ స్పీకర్ గా గుర్తింపు సర్టిఫికెట్ పొందిన సత్యరాజ్ ఉపారపు పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు, కేరిర్ గైడెన్స్ కి సంబందించిన అంశాల గురించి చెబుతున్నారు.అలాగే పరీక్ష లలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపుతూ దిశ నిర్దేశం చేస్తున్నారు.కెరీర్గైడెన్స్’ ఇవ్వటం ద్వారా వారి జీవితంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా తనవంతుగా కృషిచేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా…సామజిక మధ్యమాల వేదికగా సమాజానికి ఉపయోగకరంగా సోషల్ మీడియా లో ముఖ్యంగా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి ఆయా వాట్సాప్ గ్రూపు ల్లో ప్రజా సంక్షేమ పథకాలకు సంబందించిన సందేశాలు, విద్య,ఉద్యోగ, ఉపాధి, ఉచిత శిక్షణ, మరియు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగ పడే అంశాలు అర్హులకు చేర వేస్తారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా … ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సాయాన్ని అందించాలనే లక్ష్యంతో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ద్వారా జిల్లా వ్యాప్తంగా తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. మహిళల స్వయం ఉపాధికి సంబందించిన టైలరింగ్, మగ్గం,కంప్యూటర్ వంటి శిక్షణలకు సంబందించిన సమాచారం అందిస్తూ వారిని ప్రోత్సాహిస్తున్నారు.శిక్షణ పొందిన వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం వచ్చేలా కృషిచేస్తున్నారు. అలాగే వివిధ రంగాల్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తు ప్రోత్సహిస్తున్నారు మహనీయులను స్మరిస్తూ….మహా నీయులను స్మరిస్తూ అంబేద్కర్, గాంధీజీ, నేతాజీ, సావిత్రి బాయి, మహాత్మా జ్యోతి రావ్ ఫూలే,కొమురం భీం,చాకలి ఐలమ్మ,పాపన్న గౌడ్ లాంటి మహా నీయుల జయంతి, వర్ధంతులు నిర్వహిస్తూ వారి త్యాగాలను వారి కృషిని నేటి యువతకు తెలుపుతున్నారు. ఆపన్నులకు అండగా… బీద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు సంబందించి తక్షణ సహాయర్థం 5000 రూపాయలు అందిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు చలికాలంలో దుప్పట్లు వంటివి పంపిణీచేస్తున్నారు. జన్మదిన వేడుకలకు సైతం అనాధ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లు పంపిణి పదవ తరగతి చదివే పేద విద్యార్థులకు తమ సొసైటీ ద్వారా ఉచితంగా పెన్నులు ప్యాడ్లు పంపిణి చేస్తున్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానిస్తు ప్రోత్సహిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం పేదలు, వలస కార్మికులు, యాచకులకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కౌన్సిలింగ్లతో.. చిన్న తగాదాలతో విడిపోవాలనుకున్న దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి సంసారం చేసుకునే ప్రోత్సహిస్తున్నారు. వందలాది జంటలను ఆ విధంగా నిలిపేందుకు తనవంతుగా పాత్రను పోషించారు. సమాజం కోసం ఆలోచిద్దాం… నిజమైన సంతోషం సేవలోనే ఉంది. మన చుట్టు ఉన్న మనుషుల కష్టాలను పట్టించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. మనవంతు బాధ్యతగా సమాజం కోసం పని చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.తోటి వారికి సహాయంలో సంతృప్తి మాకున్న దాంట్లో కొంత సమాజ సేవ కోసం వెచ్చించాలనే సదాశయంతో సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. తద్వారానే ఎంతో సంతృప్తి పొందుతున్నాం. ప్రతిఒక్కరూ ఎంతోకొంత సమాజానికి సేవచేస్తే అభాగ్యులు, అన్నార్తులకు మేలు జరుగుతుంది.
– ఉపారపు సత్యరాజ్
రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ & ప్రెసిడెంట్
