Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథ మఠంలో మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు గారు సతీ సమేతంగా పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి సతీమణి శ్రీమతి తోట అర్చన శివుడికి అభిషేకం చేశారు.. అశేషంగా తరలి వచ్చిన భక్తుల మధ్య మఠాదిపతి సోమాయప్ప స్వామితో కలిసి మఠంలో ఏర్పాటు చేసిన భక్తి సాంస్కృతిక భజన కార్యక్రమాలను ఆధ్యాత్మిక చింతనతో తిలకిస్తూ జాగారం చేశారు. మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులను శాలువాతో సత్కరించారు.. ఎమ్మెల్యే అక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.. పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాని తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగారం మాజీ తాజా ఎమ్మెల్యే హనుమంత్ సిందే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప సెట్ కారు, డెలికేట్ విట్టల్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఎరిగి సర్పంచ్ సంతోష్ పటేల్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు భక్తులు పాల్గొన్నారు