

మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా బాబా సమాది దర్శనము బరులుతిరిన భక్తుల
పట్నాపూర్ మరియు తపోభూమి దామాజి (మల్లంగి) పుణ్యక్షేత్రం యందు అన్ని విధాలుగా అభిరుద్ది చేస్తాం ఎమ్మెల్యే కోవ లక్ష్మీ.
జనం న్యూస్ 27ఫిబ్రవరి కొమురం భీమ్. జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నపూర్ శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా ధ్యాన కేంద్రంలో ఘనంగా రెండు రోజులు మహాశివరాత్రి మహోత్సవం నిర్వహించారు మహాశివరాత్రి మహోన్నత సందర్భంగా ధ్యాన కేంద్రంలో రాత్రి భజన కీర్తనాలతో మారుమోగింది.అనంతరం బాబా సతిమణి ఇంగిలే దుర్పతబయి, బాబా తనయులు కేశవ్ వమాన్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన ధ్యాన ధారణ గ్రంథ పూజ చేశారు. భారీగా బాబా సమాధి దర్శనం కొరకు మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ధ్యాన మందిరంలో బాబా పురాతన చిత్రాలు వీక్షణ కొరకు ఏర్పాటు చేశారు,బాబా సమాధి చిత్రాలు హరిద్వార్,ఢిల్లీ బడార్ తదితర ప్రాంతంలో శ్రీ పూలజీ బాబా సందర్శించిన చిత్రాలు భక్తుల కొరకు ధ్యాన కేంద్రంలో స్టాల్ ఏర్పాటు చేశారు.భక్తులకు నీటి సౌకర్యం ఉచిత అన్న దాన కార్యక్రమం సంస్థాన్ తరుపున నిర్వహించారు .అనంతరం సంస్థాన్ అద్యుక్షడు కేశవ్ రావు మాట్లాడుతూ బాబా బోదించిన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ నేడు ఎన్నో కుటుంబాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, నేడు మంచి మార్గంలో నడుస్తున్నాయి అని తెల్పారు. దేవుడు ఎక్కడో లేడూ మనలోనే ఉన్నాడు అని శ్రీ పూలజీ బాబా ఎప్పుడు భక్తులకు బోధిస్తుండేవారు వారి మార్గంలో నడుస్తూ నేడు పట్నపూర్ ధ్యాన కేంద్రంలో ఎంతో మంది భక్తులు బాబా సమాధి దర్శనం కొరకు తరలివస్తున్నారు. త్వరలో బాబా సమాధి మందిరం ఒక భవ్య దివ్య మందిరం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. సంస్థాన్ యందు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా పోలీస్ వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు,వాహనాల నిలుపు కొరకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు, సంస్థాన్ గౌరవ అద్యుక్షడు వమాన్ ఇంగిలే భాగవంత్ రావు దూక్రే సుభాష్ మగడే దాదా రావు తాజా మాజీ సర్పంచ్ ఖండారే బాలాజీ కుంరా కేశవ్ బీఆర్ఎస్ నాయకులు భీంరావు సతీష్ సమాధాన్ మారు .ఈ కార్యక్రమం లో ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ నేడు పట్నాపూర్ ధ్యాన కేంద్రంలో భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెల్పతు,నేడు బాబా మార్గంలో మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్ర భక్తులు భారీగా తరలివచ్చారు మల్లంగి ప్రాంతంలో బాబావరు తపస్సు చేసిన స్థలం తపోభూమిగా పేరుగాంచింది, రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్దికొరకు నివేదిక పంపడం జరిగింది ఎమ్మెల్యే నిధులతో త్వరలో అటవీ శాఖ అనుమతి తీస్కొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని కోవ లక్ష్మీ తెలిపారు

