Listen to this article

జనం న్యూస్ 27 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల శంకర్) టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో బూత్ నెంబర్ 22లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన త్రాగునీరు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని ఎటువంటి పొరపాట్లుకుతావు లేకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా నల్గొండ రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్స్ లను తీసుకువెళ్లాలని సూచించారు.