

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు దత్తిరాజేరు మండలం, పెదమానాపురం గ్రామానికి చెందిన మారోజు వెంకటేష్ (25సం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు 20 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.4000/-లు జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 25న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. దత్తిరాజేరు మండలం, పెదమానాపురం గ్రామానికి చెందిన ఒక మైనరు బాలిక గజపతినగరం లో ఒక ప్రైవేటు కళాశాలో ఇంటర్ చదువుతున్నట్లు, బస్ పాస్ కోసం తే.29-06-2023దిన విజయనగరం వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని పెదమానాపురం పోలీసు స్టేషన్లో బాలిక తల్లి రిపోర్టు చేయగా పెదమానాపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును పెదమానాపురం పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిస్సింగ్ కాబడిన బాలికను ట్రేస్ చేసి స్టేషన్కు తీసుకువచ్చి, విచారణ చేయగా దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన నిందుతుడు మారోజు వెంకటేష్ గజపతినగరంలో ఒక ప్రైవేట్ కళాశాలలో టీచరుగా పనిచేస్తూ, పెదమానాపురం గ్రామంలో ట్యూషన్ చెప్పేవాడని, అతని వద్దకు స్కూల్ చదువుతున్న సమయంలో ట్యూషన్కు కోసం వెళ్ళే సమయంలో సదరు బాలికతో పరిచయం ఏర్పరుచుకొని, ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను తీసుకొని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి హాస్టల్ మరియు అద్దె ఇంటిలో ఉంచినట్లు శారీరకంగా మోసగించినట్లు సదరు విద్యార్ధిని పెదమానాపురం పోలీసు స్టేషనులో స్టేట్మెంటు ఇవ్వగా, పెదమానాపురం పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును అప్పటి డిఎస్పీ పి.శ్రీనివాసరావు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రంను తే.12-11-2023 దిన దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా డిఎస్పీ పి.శ్రీనివాసరావు చర్యలు చేపట్టగా, నిందితుడు మారోజు వెంకటేష్ (25 సం.లు) మైనరు బాలికను అపహరణకు గురిచేసి, అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 20సం.లు కఠిన కారాగారం మరియు రూ.4000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, అప్పటి బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో గజపతినగరం జి.ఎ.వి.రమణ, పెద మానాపురం ఎస్సై ఆర్.జయంతి, కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎన్.చిన్నయ్య, సి.ఎం.ఎన్. హెచ్ సి సిహెచ్.రామకృష్ణ త్వరితగతిన సాక్షులను కోర్టులో హాజరు పర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష త్వరితగతిన పడే విధంగా పోలీసువారి తరుపున వాదనలు వినిపించి పోక్సో కోర్టు ఇన్చార్జ్ పిపి మెట్టా ఖజానారావు ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.