Listen to this article

జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు కీ॥శే॥ చల్లా సతీష్ జయంతి సందర్భముగా మంగళవారం స్థానిక కోట జంక్షన్ లో గల విజయ రక్త నిధి కేంద్రంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు స్నేహితుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి 22 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తరువాత బదిరీలు విద్యార్థుల సమక్షంలో చల్లా సతీష్ జయంతి వేడుకలు జరిగాయి. తర్వాత స్థానిక నరవ జంక్షన్ వద్ద ఉన్న ఎ.ఎమ్.జి కాలనీలో వందమందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తమాష్ , కార్యవర్గ సభ్యులు అనకాపల్లి అశోక్, సాయికుమార్, రాయల్ క్యాబ్స్ శరత్, పి.రఘు, రాము, పి.రఘు, విజయ్, వినయ్, సాయి ప్రసాద్, విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ, గణేష్, హరీష్, అశోక్, కిషోర్, ప్రసాద్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.