

జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.