

జనం న్యూస్ ఫిబ్రవరి 27 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి ఎల్ సంగమేశ్వర్. పాపన్నపేట మండలం లో ని ఏడుపాయల క్షేత్రం లో ప్రతి యేటా సాగె మహా శివరాత్రి పర్వదిన న సాగె జాతర,తెలంగాణ లో నే రెండవ అతిపెద్ద జాతర సాగె పుణ్యక్షేత్రం అయినా ఏడుపాయల వానదుర్గ భవాని జాతరకు వందల సంవత్సరాల నుండి పాపన్నపేట సంస్థానం బండి కి ఒక ప్రత్యేక స్థానం వుంది ఆనాటి రాజుల కాలం నుండి ప్రతి యేటా జరిగే ఏడుపాయల జాతరకు మొట్ట మొదటి బండి ఈ పాపన్నపేట కి చెందిన బండి కావడం ఎంతో ప్రత్యేక స్థానం ను కలిగి ఉండడం గొప్ప విషయం. అలాగే ఈ రోజు జరుగుతున్న జాతర కు పక్కన వున్నా రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, మరియు తెలంగాణ లోని పలు జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఏడుపాయల వానదుర్గ మాతను దర్శిషించొకోవడానికి మరియు వారి మొక్కులను చెల్లించుకోవడానికి తండోపా తాండూలుగా తరలి వస్తున్నారు.
