

జనం న్యూస్ జనవరి 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం- 2005 సొసైటీ జిల్లా ఆర్గనైజర్ గా
రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గోగర్ల రాజేష్ ను నియమించినట్లు సొసైటీ రాష్ట్ర నియామకాల ఇంచార్జ్ చందమల్ల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్ శనివారం రోజున నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోగర్ల రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని, ఆర్టీఐ పై అవగాహన కార్యక్రమాలు చేపడతానని, సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. సహా చట్టం విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమన్నారు. తన పైన ఉన్న నమ్మకంతో తనకు బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర నియామకాల ఇంచార్జ్ సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.