

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి. జనం న్యూస్ ఫిబ్రవరి 27, 2025:కొమురం భీమ్(ఆసిఫాబాద్ )జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తెలిపారు. గురువారం జిల్లాలోని జైనూర్, కెరమెరి మండలాలలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ శాసనమండలి సభ్యుల ఎన్నిక పోలింగ్ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, విద్యుత్, వెలుతురు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి వరసలో నిలబడి ఉన్న వారికి చిట్టీలు అందించి వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.