Listen to this article

జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ మహిళ సంఘాలను అభివృద్ధి చేసి , మహిళలను సంపన్నులుగా మార్చాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు కేటాయించిన నర్సరీ బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మహిళా సంఘాల మహిళలకు కష్టాలపాలు చేసింది. 2022-23 ఎస్.జి.హెచ్బ్ మహిళ సంఘాలైన విజయ లక్ష్మి సమభావన సంఘంకు 4,79,000 లక్షల రూపాయలు కేటాయించగా , 2023-2024 సంవత్సరంలో ప్రగతి లక్ష్మి సమభావన సంఘానికి 4,00,000 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పనులు ప్రారంభించి ఎరువును కలిపిన ఎర్ర మట్టిని ప్లాస్టిక్ సంచులలో కూలీలతో నింపి మొక్కలు నాటి మున్సిపాలిటీకి అందజేయడం జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మహిళా సంఘాలు అప్పు చేసి ఖర్చు చేసిన బిల్లులు రాకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నారు .నందికొండ మున్సిపాలిటీ ,కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి మహిళలు తమ గోడు విన్నవించుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. మహిళ సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న ప్రభుత్వాలు , వాళ్లని కోటీశ్వరులు చేయకున్నా పర్వాలేదు కానీ వాళ్లు అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా మున్సిపాలిటీలో మహిళ సంఘాలు చేసిన నర్సరీ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తే చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల పాత నర్సరీ బకాయిలు చెల్లించకుండానే మళ్లీ నందికొండ మున్సిపాలిటీలో నర్సరీ పనులు ప్రారంభించినట్లుగా మహిళా సంఘాలు వాపోతున్నాయి.