

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ 9వ వార్డు పరిధిలో బీసీ కాలనీలో వాయు లింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వాయు లింగేశ్వర దేవాలయంలో లింగోద్భవ కాలంలో ఉప్పల శ్రీపాద శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి ఉపవాస దీక్ష ఉపసంహరణ సందర్భముగా ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ అభివృద్ధికి సహకరించిన ట్రాన్స్కో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బత్తుల రామయ్యను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో బత్తుల నాగరాజు ,వేముల శ్రీకాంత్, బండారు రామాంజనేయులు, బండారు శ్రీనివాస్, బండారు కృష్ణ, బత్తుల నాగ భాస్కర్, బండారు రామసాయి , బత్తుల శ్రీకాంత్ ,తమ్మిశెట్టి విజయకాంత్ ,తమ్మిశెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.