Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఆంజనేయులు మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు.