

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి మహా శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని , చెయ్యరు గ్రామ వాస్తవ్యులు శ్రీ త్సవటపల్లి నాగేంద్రరావు దంపతులు 313 గ్రా బంగారం తయారు చేసిన సుమారు 25 లక్షలు విలువచేసే సువర్ణ నాగా భరణం ముమ్మిడివరం శాశన సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు సమక్షంలో అధికారులకు, అర్చకులకు అందించారు. తొలుత నాగాభరణానికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ సంప్రోక్షణ నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహ వాచనం, అభిషేకం జరిపారు అనంతరం స్వామి వారినిజ రూప లింగానికి విశేష అలంకరణ చేశారు.
