Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు ఆన్‌లైన్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. సైబర్‌ నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించాలని తప్పుడు మార్గాలను ఎంచుకోని రకరకాల సైబర్‌ నేరాలతో అమాయక యువతను,ప్రజలను మోసం చేస్తున్నారని, సైబర్‌ నేరాల నుంచి బయట పడాలంటే అవగాహన ఎంతో అవసరం అన్నారు.సాంకేతికంగా ఎంత అభి వృద్ధి చెందిన అంతే వేగంగా సైబర్‌ నేరాగాళ్లు మోసాలు చేస్తున్నారని అన్నారు. వాటాప్స్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ట్విట్టర్‌, పేస్‌బుక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా వచ్చే లింకులను ఓపెన్‌ చేయరాదని సూచించారు.ఆన్‌లైన్‌లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకురాదన్నారు.