Listen to this article

జనం వార్తలు జనవరి 11
రిపోర్టర్ : ఎం రమేష్ బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతం.

సింగరేణి రామగుండం ఏరియా-1 అద్వర్యంలో చౌరస్తా సమీపంలో గల “నూతన షాపింగ్ కాంప్లెక్స్” నిర్మాణం కోసం భూమి పూజా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిదిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారి సతిమని శ్రీమతి మనాలి ఠాకూర్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మరియు ఎసిపి మడత రమేష్ , ఆర్జీ.1 ఏరియా జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ ముఖ్య అథితులుగా హాజరయి భూమి పూజా నిర్వహించటం జరిగింది.ఈ సందర్బంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి గోదావరిఖని సింగరేణి నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గోదావరిఖని నగర అభివృద్దే ద్యేయంగా చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా చౌరస్తా సమీపంలో గతంలో మున్సిపల్ ఆద్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలో చిన్న చిన్న షాపులు కోల్పోయిన వారికి సింగరేణి స్థలం గాంధి నగర్ నందు తాత్కాలిక షాపులు నిర్మించి ఉపాది కల్పించడము జరిగినది. ఇట్టి వాటిని తిరిగి మున్సిపల్ అద్వర్యంలో తొలగించి నూతన షాపింగ్ మాల్ నిర్మించుటకు ఈ స్థలంలో సుమారు 15 కోట్ల వ్యయంతో సుమారు 344 రూములను సింగరేణి సంస్థ నిదులతో నిర్మించుటకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి కాంప్లెక్స్ ద్వారా గోదావరిఖని నగరానికి కొత్త రూపు తీసుకొస్తుందని తెలిపారు. ఇదే విధంగా గోదావారిఖని అభివృద్ధి కోసం అనేక పనులను చేపట్టటం జరిగిందని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా 500 MW సామర్థ్యం గల హైడ్రో పవర్ ప్లాంట్ & సోలార్ ప్లాంట్ ను మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో ఏర్పాటు చేయబోతున్నారని తద్వారా మేడిపల్లి గ్రామంలో పూర్వ వైభవం రాబోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరి అరెల్లి పోషం, మున్సిపల్ కార్ఫోరేటర్స్ మహంకాళీ స్వామీ, పెద్దేల్లి తేజశ్వని ప్రకాష్, కొలిపాక సుజాత, దుబాసి లలిత, పాతిపెల్లి ఎల్లయ్య, ఎస్.ఓ.టు జిఎం రాంమోహన్, డిజీ.ఎం పర్సనల్ కిరణ్ బాబు మరియు అధికారులు డి.వి రావు, ఆంజనేయ ప్రసాద్, వర ప్రసాద్, అంజనేయులు, హనుమంత రావు తదితరులు పాల్గోన్నారు.