Listen to this article

మండపేట ప్లాష్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండపేట టౌన్ రూరల్ లో కలిపి మొత్తం 79.28 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ బూత్ వారీగా పరిశీలిస్తే వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పి ఎస్ నెంబర్ 153 లో 77.97 శాతం, పి ఎస్ నెంబర్ 154 లో 78.11శాతం , పి ఎస్ నెంబర్ 155 లో 80.31 శాతం, పి ఎస్ నెంబర్ 156 లో 81.07 శాతం ఓటింగ్ నమోదు అయింది. మండపేట డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఎస్ నెంబర్ 157 లో 83 శాతం, 158 లో 81.10 శాతం, 159 లో 74.47 శాతం ఓటింగ్ నమోదు అయింది. మండపేట శ్రీ రామ హిందు స్కూల్ లో 160 లో 78.81 శాతం ఓటింగ్ నమోదు అయింది. పురుషులు 2295 మంది , మహిళలు 1711 మంది మొత్తం 4006 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1863 మంది, మహిళలు 1313 మంది మొత్తం 3,176 మంది ఓట్లు వేశారు. దీంతో మొత్తం శాతం 79. 28 గా నమోదు అయింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రామ చంద్రపురం డిఎస్పీ రఘువీర్ ఆద్వర్యంలో సి ఐ లు దొర రాజు, సురేష్ లు బందోబస్తు నిర్వహించారు. తహసిల్దార్ తేజశ్వరరావు , డిప్యూటీ తహసీల్దార్ మెహర్ బాబా రెవెన్యూ సిబ్బంది ఎన్నికలను పర్యవేక్షించారు.