

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం…నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.