

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ లక్ష్మివారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ అప్పల సూర్యనారాయణ అనే పాసింజర్ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణం చేశారు , ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 17500 బస్సులో పడిపోయాయి. సదర్ కాంట్రాక్టర్ పి ఎన్ ఎం రాజు గుర్తించి , ఆర్టీసీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సత్యం కి అందజేశారు. సదరు డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి వచ్చి అడగగా అతని యొక్క వివరాలు తెలుసుకుని డిపో మేనేజర్ శ్రీనివాసరావు సమక్షంలో నగదును ఇవ్వడం జరిగింది. డబ్బులు తిరిగి ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.