

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనప్పటికీ కక్షసాధింపుల్లో మాత్రం సఫలం అవుతోందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ సెటైర్ వేశారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ… కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే రాత్రికి రాత్రే పోసానిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 26వ తేదీ రాత్రి అరెస్ట్ చేసి నోటీసులో మాత్రం 27వ తేదీ రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎలా పేర్కొంటారన్నారు.