

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, నిర్రీత సమయానికి పూర్తయ్యే విధంగా చూడాలని ఎడ్యుకేషన్ కార్యదర్శులను మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. గురువారం కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పౌర సేవలు అందించడమే సచివాలయాల ముఖ్య ఉద్దేశమన్నారు. కొంతమంది పౌర సేవలు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. ఇక నుంచి అలా జరగకూడదని సూచించారు.