Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా పోలీసు విభాగంలో నిరంతరం విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన ఎస్‌.బి ఏ.ఎస్.ఐ ఆడారి వెంకట సన్యాసిరావు కి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ ఆడారి వెంకట సన్యాసిరావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆడారి వెంకట సన్యాసిరావు సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో అంకితభావంతో విశేష సేవలు అందించారని, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించడంతోపాటు, ప్రజలకు అహర్నిశలు సేవలు అందించారని ప్రశంసించారు. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం సేవ చేయడం గొప్ప గౌరవంగా భివర్ణించారు.పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ సుమారు 35 సంవత్సరాలు వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, పోలీసు శాఖకు విశేష సేవలు అందించారని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, అవసరమైనప్పుడు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, ఎస్.బి డీఎస్పీ బి.అప్పారావు, ఏ.ఓ ఎ.రామ కుమార్, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, బాల సూర్యరావు, రమేష్, రామకృష్ణరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.//