Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం 2025- 26 బడ్జెట్ ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ప్రతిపక్ష వైసిపి దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుల్ స్టాప్ పెట్టారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు పేదల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని బడ్జెట్ స్పష్టం చేస్తుందని అన్నారు. మొత్తం బడ్జెట్ 3,22,359 కోట్లు, రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు ఉండగా , రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, దీని మూలంగా ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు భారీగా కేటాయింపులు చేశారని, బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్లు ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 5,434 కోట్లు కేటాయించడం చూస్తే వైసిపి పాలనలో ఏనాడూ కూడా ఇంత మొత్తంలో కేటాయించలేదని, ఒకవేళ కేటాయించిన నిధులు మళ్లించి ఆయా వర్గాలకు అన్యాయం చేస్తూ వంచనకు గురి చేసే వారిని జగన్ రెడ్డి పై మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలపై జగన్ రెడ్డి కాకి గోలకు బుద్ధి చెప్పే విధంగా బడ్జెట్లో తల్లికి వందనం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 27,518 కోట్లు దీపం పథకం ఉచిత సిలిండర్లకు 2,601 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కోసం 6,300 కోట్లు, మత్స్యకార భరోసా పథకానికి 450 కోట్లు, విద్య వైద్య ఈరోజు ప్రతి ఒక్కరికి అందే విధంగా పాఠశాల విద్యకు 31,805 కోట్లు, వైద్య, ఆరోగ్య,కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు కేటాయించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించడం మంచి ప్రభుత్వంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ధ్యేయం కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని దానికి అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు చేశారని, ఇక విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు కేటాయించి వారికి ఇచ్చిన హామీ ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించారని, అలాగే మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్లు ఖర్చు చేయడానికి నిధులు కేటాయించడం చూస్తుంటే ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం బడుగు బలహీన,హరిజన, గిరిజన, వర్గాలు అభ్యున్నత కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా తేటతెల్లమవుతుందని ఇది మంచి ప్రభుత్వం గా ప్రజల మన్నల పొందుతుందని వెంకటరావు ఆశాభావం వ్యక్తపరిచారు.//