

జనం న్యూస్ 28 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు దాదాపు 200 మంది భక్తులతో ఉదయం 11 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులు అమ్మ కల్కి భగవాన్ ఆరోగ్య సోమ దీక్షను పాటిస్తూ భక్తి పరవశంతో మునిగితేలారు ఏ కుటుంబం అయితే ఆర్టిక ఇబ్బందులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు అమ్మ కల్కి భగవాన్ నమ్ముకొని పూజించినట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని భక్తులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమం జి శ్రీనివాసరావు అప్పారావు టి వై ఎస్ ప్రసాద్ డి లలిత,బి శ్రీ చిద్వి , కరుణాకర్ తదితర భక్తులు పాల్గొన్నారు