Listen to this article

జగజంపుల తిరుపతి,పి.డి.ఎస్.యూ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి

జనం న్యూస్ పీబ్రవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు కారణం అవుతు, నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను రాష్ట్ర వ్యాపితంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, పి.డి.ఎస్.యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం *పి.డి.ఎస్.యూ కొమురంభీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశార ఈ సందర్భంగా *జగజంపుల తిరుపతి పి.డి.ఎస్.యూ. జిల్లా ప్రధాన కార్యదర్శి, లెనిన్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా వందల మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యాసంస్థలలో చనిపోతున్నారని, నిన్న ఖమ్మం జిల్లా లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో యోగ నందిని అనే విద్యార్థి ఆత్మహత్యా చేసుకొని చనిపోవడం జరిగిందని, ఆత్మహత్య కు కారణమైన వారిని కఠినంగా చట్టప్రకారం శిక్షించాలని అదేవిధంగా బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని , శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులను ర్యాంకుల కోసం మార్కుల కోసం మానసికంగా తీవ్ర ఇబ్బందుల గురిచేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా నాసిరకం భోజనం పెడుతూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని, అనుమతి లేకుండా వందల సంఖ్యలో శ్రీ చైతన్య బ్రాంచ్ లను నెలకొల్పోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వరుస ఆత్మహత్యలపైన సమగ్రంగా విచారణ జరపాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలని, అదే విధంగా జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో నడుస్తున్న శ్రీ చైతన్య బ్రాంచ్ కూడా నిబంధనలకు విరుద్దంగా నడుస్తుందని ఆ పాఠశాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యూ.)గా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. పట్టణ నాయకులు పులి సుశాంత్, కర్రే అరుణ్ కుమార్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.