Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : గౌరీ గ్రంథాలయంలో మార్చి 2న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రముఖ పోటీపరీక్షల శిక్షణా కేంద్రం శ్రీధర్‌ సీసీఇ ఆధ్వర్యంలో ‘ఏపీ పోలీస్‌ కాన్సిటేబుల్‌ మెయిన్స్‌’ టాలెంట్‌ టెస్ట్‌ జరగనున్నదని గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. టాలెంట్‌ టెస్ట్‌లో పాల్గొనదలిచిన విద్యార్దులు https://forms.gle/UQtJfX9XpEsJhL3o6 లింక్‌ను క్లిక్‌ చేసి తమ పేర్లును ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టాలెంట్‌ టెస్ట్‌ విజేతలలకు మొదటి బహుమతిగా రూ. 10,116, రెండు, మూడు బహుమతులకు రూ. 5,116, రూ. 3,116, నాలుగు నుంచి 10 బహుతులకు రూ. 1,116 చొప్పున అందజేస్తారు. అదే విధంగా ప్రొత్సాహక బహుమతులు కూడా ఉంటాయన్నారు. వివరాలకు 9326688899 మొబైల్‌ నెంబర్‌ను సంప్రదించాలని కాండ్రేగుల వెంకటరమణ ఆ ప్రకటనలో తెలిపారు.