Listen to this article

ఫస్ట్ ప్రైజ్ సద్గురు బండ అయ్యప్ప స్కూల్ లక్ష రూపాయలు

సెకండ్ ప్రైజ్ జ్యోతిబాపూలే బిచ్కుంద 50,000

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం శ్రీ సద్గురు బస్వలింగప్ప స్వామి సంస్థాన్ మఠంలో మఠాధిపతి శ్రీ సోమాయప్ప ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి..వరుసగా రెండు రోజులు సాంస్కృతిక నృత్యప్రదర్శన పోటీలు నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి సతీమణి అర్చనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు,నృత్యప్రదర్శనలు వీక్షించి, విజేతలను ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు,ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు, అదేవిధంగా అద్భుతమైన ప్రదర్శనలతో పోటీలలో పాల్గొన్న వారందరినీ అభినందించారు.. జుక్కల్ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఇంతటి ప్రతిభ గల విద్యార్థులు, మట్టిలో మాణిక్యాలు ఉన్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరి పెర్ఫార్మన్స్ ఎంతో ఆకట్టుకున్నదని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి అని.. వాటిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప సెట్ కార్, కుమార్ సెట్ కొలవార్, బిజెపి మండల అధ్యక్షుడు విష్ణు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ,బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సాయిల్ రమేష్ సెట్, భాస్కర్ రెడ్డి, యోగేష్, సాయిని అశోక్, జ్యోతిబా పూలే ప్రిన్సిపాల్ భరత్ భూషణ్, కలీం, యోగేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు