

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం జాతీయ టైలర్స్ డే సందర్బంగా ఆదర్శనగర్ మేరు టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేరు సంఘంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సాహించే విదంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ధ్వరా కుల వృత్తులు చేసుకునేవారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగలు మరియు శిక్షణ సమయంలో 500 ఉపకారవేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు, పనిముట్లు ఇతర పరికరాలకు ఎటువంటి పూచి కత్తు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సతమతం అవుతున్నారని వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనేత్తుతనని హామీ ఇచ్చారు. మేరు కులావృత్తులు చేసుకునే వారికీ ఉచిత కరెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మేరు కుల కార్పొరేషన్ ఏర్పాటుకు పరిమితం కాకుండా మేరు కుల సంఘం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి. మేరు కుల వృత్తులు చేసుకునే వారికీ ప్రభుత్వం చొరవ తీసుకోని 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు.అలాగే 50 ఏళ్ళు పై బడిన మేరు సోదరులకు పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని అన్నారు బట్టలు కుట్టే దర్జీ సోదరి, సోదరిమనులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టి కుల వృత్తులు చేసుకునే వారికీ చేయూతనివ్వాలని అన్నారు.అంతర్జాతీయ టైలర్స్ డే సందర్బంగా కుల వృత్తి చేసుకునే వారికీ ధన్ పాల్ లక్ష్మి బాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగ కిషన్, జిల్లా అధ్యక్షులు సోమా హనుమంతరావు, నగర అధ్యక్షులు దశరథమ్, స్థానిక కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎర్రం సుదీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.