

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 28. తర్లుపాడు గ్రామంలో వెంచేసి వున్న భద్రాఖాళీ సమేత వీరభద్రుని ఆలయంలో ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ నేరెళ్ల సాంబశివరావు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు, ఉభయ దాతలు గా నేరెళ్ల కుమార్ దంపతులు, నేరెళ్ల కార్తీక్ దంపతులు వ్యవహరించారు వేద పండితులురవిశర్మ, రంగానాద శర్మ , ఆర్ ఎస్ శర్మ,కృష్ణశర్మ, సాయి మోహన్ ,భార్గవ్ శర్మ .మంత్రోత్సరణ నడుమ శ్యాస్త్రోత్తంగా భద్రకాళీ, వీరభద్రస్వామివారి ప్రాశస్థ్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. దీంతో ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల అర్చకులు కల్యాణ ఘట్టం పూర్తి చేశారు. దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకరించిపోయారుఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పోలేపల్లి జనార్దన్, వాడేల కృష్ణ ప్రసాద్, జవ్వాజి విజయ భాస్కర రావు,ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు,వెన్నా రాజా రామ్ రెడ్డి, కొలగట్ల భాస్కర్ రెడ్డి, బేడుదూరి పుల్లయ్య, కొలగట్ల నారాయణరెడ్డి, కుందురు చిన్న కాసిరెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, కసెట్టి రవి తదితరులు మహిళా భక్తులు పాల్గొన్నారు