Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేట నందు ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిలిపి చెడుమండల విద్యాధికారి విట్టల్ మాట్లాడుతూ సైన్స్ అనేది మన జీవితంలో భాగమని, మన పనిని లభతరం చేయడంలో మనం చేసే కృషి నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని అన్నారు. విద్యార్థులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని జాతీయ సైన్స్ దినోత్సవం 2025 తీమ్ వికసిత భారత కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్ లో గ్లోబల్ లీడర్షిప్ కోసం భారతీయ యువత సాధికారత ను గుర్తు చేశారు అనంతరం సివి రామన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ కుమార్, యాదాగౌడ్, సుధారాణి, మోహన్, మహేష్, విజయ, సంగీత పాల్గొన్నారు