

పుస్తకాలు చదవాలి. ఎదగాలి – జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
జనం న్యూస్ ;28 : ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వారి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంచార పుస్తక ప్రదర్శనలో భాగంగా మల్టీపర్పస్ హైస్కూల్ సిద్దిపేటలో సంచార పుస్తక ప్రదర్శనను జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ మాట్లాడుతూ బాలలు పుస్తకాలు చదవాలి. ఎదగాలి అంటూ బాలల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని, అందుకు ఇట్టి సంచార పుస్తక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సిద్దిపేట పట్టణంలో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో మార్చి రెండు వరకు సంచార పుస్తక ప్రదర్శన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ బి టీ రీజినల్ మేనేజర్ డాక్టర్ పతిపాక మోహన్, సెక్టోరియల్ ఆఫీసర్ భాస్కర్, మండల విద్యాధికారి రాజ ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, కవులు ఐతా చంద్రయ్య, గరిపల్లి అశోక్, జంగిటి శాంతాకుమారి, సమ్మేట ఉమాదేవి, ఎన్నవెల్లి రాజమౌళి, ఉండ్రాళ్ల రాజేశం, అమ్మన చంద్రారెడ్డి, డబ్బికార్ సురేందర్, పప్పుల రాజిరెడ్డి, కొడిచెల్లి రామానుజ, జెగ్గారి నిర్మల తదితరులు పాల్గొన్నారు