

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సొంత ఆలోచన విధానంతో రకరకాల సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. రంగోలితో మానవుని అవయవాలను సైన్స్ కు సంబంధించిన పరికరాలను విద్యార్థులు అద్భుతంగా వేయడం జరిగింది.వారిని ఉపాధ్యాయులు అభినందిచారు పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుందని పరిశోధనలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడం,ఆలోచింపచేయడం సైన్స్ ఉపాధ్యాయుల ప్రథమ కర్తవ్యం అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం రాజేష్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్ ఉపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.