

జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్నిఘనంగానిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ, సాంకేతిక కార్యకలాపాలను వివరించడానికి, ప్రాథమిక శాస్త్రాలలో కొన్ని అంశాలను ప్రదర్శించడానికి అనేక శాస్త్రీయ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ లలిత మాట్లాడుతూ ఉదయం 10.00గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రొఫెసర్ సి.వి. రామన్ నోబెల్ బహుమతిని గెలుచుకోవడానికి దారితీసిన రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణను గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, సైన్స్ డేలో అన్ని సబ్జెక్టుల నుంచి వివిధ నమూనాలు ప్రదర్శించారని విద్యార్థులు సమాజానికి దిక్సూచిలాఎదగటానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిస్టర్ లలిత, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ మల్లవరపు మతీన, సిస్టర్ క్లారా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.