

జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం 28 ఫిబ్రవరి జనవిజ్ఞాన వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సుసంయుక్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం ది.28 -2-25 న కొత్తగూడెం మానస వికాస్ స్కూల్ నందు నిర్వహించినారు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాజ్యలక్ష్మి,మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లింగంపల్లి దయానంద్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యురాలు ఏ కస్తూరి,జిల్లా గౌరవాధ్యక్షులు ఎం సుబ్బారావు,జిల్లా అధ్యక్షులు కే వీరభద్రం, ప్రధాన కార్యదర్శి ఎం మోహన్ రావు,ప్రత్యేక ఆహ్వానితులు కొల్లు నాగేశ్వరరావు కార్యకర్త శ్రీమతి రామలక్ష్మి, మానస స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి జి కవిత, ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీవాణి,స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సర్ సివి రామన్ చిత్రపటాన్ని పూలదండతో సత్కరించడం జరిగింది. సైన్స్ దినోత్సవం కవిత అధ్యక్షతన జరిగింది. డాక్టర్ రాజ్యలక్ష్మి పిల్లలలో ఉన్న ప్రతిభ ను వెలికి తీయటానికి జాతీయ సైన్స్ రోజున విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ మరియు సైన్స్ ప్రయోగాల నమూలను తయారుచేసి విశ దీకరించిన 9 మందికి బహుమతి ప్రధానం చేశారు. ఎం సుబ్బారావు పిల్లల్లో మూఢనమ్మకాలకు తొలగించి శాస్త్రీయంగా ఆలోచింప చేయుట కోసమే జనవిజ్ఞాన వేదిక నిరంతరం శ్రమిస్తుంది అందులో భాగంగా సి.వి. రామన్ ని స్మరించుకుంటున్నామన్నారు. కస్తూరి సైన్స్ లేనిదే జీవితం లేదు,సైన్స్ వలననే ప్రగతిసాధించడం సాధ్యమవుతుంది. మూఢనమ్మకాల వలన అభివృద్ధి ఆగిపోతుంది మాట్లాడుతూ ప్రశ్నించి, పరిశీలించి మాత్రమే దేన్నైనా నమ్మాలి ఎవరో చెప్పారని గుడ్డిగా అనుకూరించకూడదు మీరంతా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆశించారు.