Listen to this article

సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. జనం న్యూస్, మార్చ్ 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి నాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. మన తెలంగాణ నుండి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ గోటితో వడ్లను ఓలిచి అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం 1-3-2025 రోజు ఉదయం 9 గంటలకు గజ్వేల్ లోని కృష్ణాలయంలో “కోటి తలంబ్రాలు దీక్ష” కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఎంపీ రఘునందన్ రావు, ఇతర అధికారులు ల్గొంటున్నారని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. భక్తులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.