Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యేలు, ఎంపీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజా సంఘాల డిమాండ్ వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. పిడియం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, పిడిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వినుకొండ పేరయ్య, పల్నాడు రైతు సంఘం నాయకులు కోలా నవజ్యోతి, ఎంసీపీఐయు మహిళా సంఘం నాయకురాలు గాదే కుమారి,ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు కుమార్ తదితరులు రాష్ట్ర బడ్జెట్లో వరికపూడిశెల ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం, దానికోసం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడకపోవడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేయటమే అని, ఎన్నికలకు ముందు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఒకరు, మరొకరు రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించడం, నేటి బడ్జెట్ మౌనం దాల్చడం పట్ల ప్రజా సంఘాలు తీవ్రంగా నిరసిస్తూ,ఈ నాయకులు నైతిక బాధ్యత వహించాలన్నారు. బొల్లాపల్లి ఎగువ పల్నాడు ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడియం రాష్ట్ర కమిటీ సభ్యులు కె. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చికినం చిన్న, తదితరులు పాల్గొన్నారు.