Listen to this article

గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ఈరోజు అలంపూర్ మార్కెట్ యార్డ్ లోని రైతులు పండించిన కందులను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన విధంగా రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయుచున్నారు కందికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకారం క్వింటాలు 7550 రూపాయల ప్రకారం పండించిన ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉంది రైతులు దృష్టిలో ఉంచుకొని దళారుల చేతిలో మోసపోకుండా రైతులు మార్కెట్ యార్డ్ కి తెచ్చుకొని గిట్టుబాటు ధర పొందాలని కోరారు