

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక తెలుగువాడిగా జాతీయ అధ్యక్షుడు గా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశారని చిన్న వయసులోనే స్వయంసేవగ్గా తదుపరి భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా అనేక పార్టీ పదవులు చేస్తూ కేంద్ర మంత్రిగా జాతీయ అధ్యక్షులుగా పార్టీకి ఎంతో సేవలు చేశారని ఎమర్జెన్సీ టైంలో 16 నెలల పాటు జైల్లో ఉన్నారని అతి చిన్న కుటుంబం నుంచి సాధారణ వ్యక్తిగా నిమ్నవర్గాలకు చెందిన వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారిని ఆయన చరిత్రను ఆయన నిబద్ధతను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు మాజీ కౌన్సిలర్ కొప్పురావూరు నాగేశ్వరరావు పట్టణ మాజీ అధ్యక్షులు గడప పుల్లయ్య ఓబీసీ పట్టణ అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు మాజీ ఓబీసీ పట్టణ అధ్యక్షులు సింగిరేషు బాలయ్య ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ జోలపురం రాయుడు మైనార్టీ యువ నాయకులు షేక్ సుభాని మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు