Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 1 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మీయ శాంతి చేకూరాలని కోరుచూ, వారి ఆత్మీయ బలిదానాలతో ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని, వారిని స్మరించుకుంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షులు, మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు, శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో గ్రామంలో అమరవీలకు జోహార్లు అర్పించారు , ఈ కార్యక్రమం జమ్మికుంట మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బోయిని సదానందం మాదిగ ఆధ్వర్యంలో, ఉద్యమ వీరులకు నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామంచ భరతు, , రుద్రార రామచంద్రం, ఆకినపల్లి సమ్మయ్య,బోని సమ్మయ్య,అలాగే, జిల్లా నాయకులు తునికి వసంత్ , మరియు మండల నాయకులు పర్లపల్లి రవీందర్,దొడ్డే అనిల్ కుమార్,పొట్లూరి మహేందర్,పుట్లూరి లింగయ్య,ఏక్ లింగయ్య మచ్చ రామచంద్రం మారేపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.