

జనం న్యూస్ మార్చ్ 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ, నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలో మహార్ యువజన సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు
చింతల మానేపల్లి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను ముందుకు నడపడం కోసం యువకులు అంత ఇక్యమత్యంగా ఉంటూ రాజకీయ పార్టీలకు, అతీతంగా సేవ కార్యక్రమాలు చేస్తూ మహార్ యువకులంతా అంబేద్కర్, బుద్ధుని మార్గంలో నడుస్తూ మహార్ సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తేది:03-03-2025 న సోమవారం రోజున మహార్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు కోసం, మండలం లోని యువకులు అంత అధిక సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ బాటలో ప్రతి ఒక్కరూ నడవల్సిన అవసరం చాలా ఉందని ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహార్ యువజన సంఘం నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.