

జనం న్యూస్ జనవరి 11 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్)
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.కోదాడ కేంద్రంలోని అనురాగ్ కాలేజీ సెంటర్లో అధికారులు తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు ఉదయం
సెషన్ లో 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఐదుగురు అభ్యర్థులను అధికారులుఅనుమతించలేదు అభ్యర్థులు ఎంత ప్రాధేయ పడిన అధికారులులోనికి అనుమతించలేదు చేసేది ఏమీలేక అభ్యర్థులు వెనుదిరిగిపోయారు ఈసందర్భంగా అధికారులు ఇప్పటికైనా అభ్యర్థులు పరీక్షకు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి వచ్చేలా చూసుకోవాలి వచ్చేటప్పుడు
ఏదైనా గుర్తింపు కార్డు,హాల్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరారు