

— కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం — వైసిపి పార్టీ వీడి టిడిపి లోకి చేరిన గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ బాయ్ నాగేనాయక్ — త్వరలో పార్టీలోకి మరిన్ని చేరికలు చేతనైతే వలసలు ఆపుకోండి వైసీపీ నాయకులకు మంత్రి సవాల్. — ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో కాదు ప్రజలంటూ జగన్ పై మండిపడ్డ మంత్రి సవిత
జనం న్యూస్ మార్చి 03 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మేజర్ పంచాయతీ కు చెందిన వైసిపి పార్టీ నాయకులు సర్పంచ్ సరోజ ,నాగేనాయక్ వైసీపీ పార్టీ వీడి క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు . సర్పంచ్ తో పాటు మరో 200 కుటుంబాలు పార్టీలోకి చేరగా వారందరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి సవితమ్మ అదేవిధంగా గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీ లో 12 కుటుంబాలు వైసిపి పార్టీ నుండి డి భాస్కర్ రెడ్డి. గోపాల్ రెడ్డి.ఎల్ భాస్కర్ రెడ్డి.గురుప్రసాద్ రెడ్డి.ప్రకాశ్ రెడ్డి.శంకర్ రెడ్డి.మధుసూదన్ రెడ్డి. సి రామకృష్ణ .హెచ్ నారాయణ. ఉతప్ప తదితరులు వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన సర్పంచ్ సరోజ, నాగేనాయక్ మాట్లాడుతూ గతంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వైసిపి పార్టీలోకి చేరామని తిరిగి సొంత గూటికి టిడిపిలోకి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే , సాధ్యమని అందుకే మంత్రి సవితమ్మ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరామని, గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీకి రావాల్సిన నిధులను పక్క దోవ పట్టించాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలోనే మా గోరంట్ల మండలంకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఈసందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సొంతగూటికి రావడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి ,సంక్షేమం ఆకర్షితులై పార్టీలోకి రావడం ఈ సందర్భంగా త్వరలో నియోజకవర్గం నుండి భారీ చేరికలు ఉంటాయని చేతనైతే వైసీపీ పార్టీ నాయకులు ఆపుకోవాలని మంత్రి తెలిపారు.ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో కాదు ప్రజలంటూ జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ .ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.