Listen to this article

చిన్నారి ప్రాణాలు పోతున్న పట్టించుకోని వైద్య సిబ్బంది

పసికందు మృతి కి కారణమైన వైద్య అధికారి పై చర్యలు తీసుకోవాలి

మార్చి 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు దం చోటు చేసుకుంది 55 రోజుల చిన్నారి జమున గొంతులో (నంజు ) నిమ్ము ఉండి శ్వాస అందక 55 రోజుల పసి కందు ప్రాణం ఆగిన ఘటన వాజేడు మండలం మండపాక చివారుగుడిసెలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారంవాజేడు మండలం కేంద్రంలోని మండపాక గ్రామ శివార్లో నివాసం ఉంటున్న గోగు బాలకృష్ణ,భారతి దంపతులకు మూడవ సంతానంగా పాపజన్మించిది నెలన్నర 45 రోజులకు వేయాల్సిన వ్యాక్షిన్ల కోసం వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లగా హాస్పిటల్ లో వ్యాక్షిన్లు అందుబాటులో లేవని, మళ్ళీ వారం రమ్మని వైద్య సిబ్బంది తెలిపారు , మల్లి వారం రోజులకు వైద్యులు చెప్పిన గడువు అనంతరం వెళ్లిన మల్లివైద్య చిబంధి అదే సమాధానం చెప్పడం వలన ఇంటికి వెళ్ళిపోయినట్లు పాప తల్లిదండ్రులు తెలిపారు. పాప ఆరోగ్యం లో తేడాలు గమనించి, ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు జలుబు, ఛాతి, గొంతు లో నిమ్ము వుంది,వెంటనే హన్మకొండ ఎంజిఎమ్ కి వెళ్లాలని వైద్యులు సూచించినట్లుతెలిపారు.ఆర్థిక స్తొమత లేకపోవడం తో ఇంటికి వచ్చామని సోమవారం తెల్లవారు జామున శ్వాస అందక ఇబ్బంది పడుతున్న పాప నుగమనించినతల్లిదండ్రులు వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే క్రమంలోనే పసి కందు జమున మృతి చెందిందని వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వలనే మా పాప చనిపోయిందని ప్రజా పాలనలో ప్రజలుకు వైద్యం కరువు అయిందని లేకపోతే శిసుసంక్షేమ మంత్రి శీతక్క సొంత జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు చిన్న పిల్లల వాక్సిన్ 45రోజులకు వేసే టీకా అందుబాటులో లేకపోవడంవల్లనేఅనారోగ్యం పాలై మరణించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికి కైనా శిసు సంక్షేమ శాఖమంత్రి ధనసరి అనసూయ (శీతక్క ) జిల్లా లోని అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రజలకు మందులను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుకొంటున్నారు