Listen to this article

జనం న్యూస్ మార్చి 03:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : అక్షరయాన్ఉమెన్స్ రైటర్ మహిళ ఫోరంవారుమహిళా దినోత్సవసందర్భంగా ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా పురస్కారాలను అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2024-2025 సంవత్సరానికి గాను అక్షర యాన్ బాలిక పురస్కారాన్ని తడపాకల్ గ్రామానికి చెందిన ఇప్ప సౌమ్య హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నదనితెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. సాహిత్యపరంగా సౌమ్య ఇప్పటికే అనేక కవితలు కథలు రాసి జాతీయస్థాయిలో బహుమతులు అందుకోవడమే కాకుండా బంగారు బాల్యం అనే కవితల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతూనే సాహిత్యంలో రాణిస్తున్నది. సాహిత్య పరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్న సౌమ్యను అక్షరయాన్ సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి ఐనంపూడి శ్రీ లక్ష్మీగుర్తించి ఈ పురస్కారాన్ని అందివ్వడం జరిగింది. ఈ పురస్కారం కింద నగదు బహుమతి ప్రశంస పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బాలికా పురస్కారం అందుకున్న సౌమ్యను తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు అభినందించారు.