Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మరియు ఇల్లంతకుంట లోని కస్తూరిబా గాంధీ మోడల్ కళాశాలలో ఈనెల 5వ తారీకు నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకి పిల్లలందరూ శ్రద్ధగా చదివి మంచిగా రాయాలని విద్య యొక్క గొప్పతనాన్ని తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలకి వివరిస్తూ మనమందరం గొప్పగా బ్రతకాలంటే రేపు మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలంటే, విద్య ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు సర్టిఫికెట్స్ కవర్స్ ని బిఆర్ఎస్ కార్యకర్త ఆకినపల్లి శిరీష పంపిణి చేసారు.