

ప్రతి ఇంటి నుండి భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు వెళ్ళాలి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచల రామయ్య కళ్యానానికి మేము సిద్ధం అంటూ రామనామ స్మరణ గంటపాటు చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామభక్తిని చాటుకున్నాడు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు దంపతులు. వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కి తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ మన చేతులతో ఓలిచి అందించే తలంబ్రాలు సాక్షాత్తు భద్రాచల సీతారాముల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోటి తలంబ్రాలలో పాల్గొనాలన్నారు. గ్రామ, గ్రామాన పంపిణికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.