

జనం న్యూస్ మార్చి 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండల కేంద్రానికి చెందిన సిపిఐ ఎం సానుభూతి పరురాలు అలుగూరి వరలక్ష్మి(78) అనారోగ్యం తో సోమవారం మృతి చెందారు.పార్టీ నాయకులు దేవరం వెంకట రెడ్డి ఆమె బౌతికాయాన్ని సందర్శించి పార్టీ జండాను కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి పోరాటాల చరిత్ర కలిగి వుందని కొనియాడారు.ఆమె మామ అలుగూరి వీరనారాయణ పేదల పక్షాన నిరంతరం పని చేశారని.నాటి జమిందారి వ్యతిరేక పోరాటం లో పాల్గొని అనేక నిర్బందాలకు గురైయ్యారని గుర్తుచేశారు.నాటి నుంచి నే టి వరకు వారి కుటుంబం పార్టీకి అంకితమై పని చేస్తున్నారని తెలిపారు.అలుగూరి కుటుంబం చివరి వరకు కరుడు కట్టిన కమ్యూనీ ష్టులుగా నిలిచి మంచి పేరు ను సంపాదించుకున్నారని గుర్తు చేశారు.వరలక్ష్మీ మృతి పార్టీ ప్రజా సంఘాల కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ కార్యదర్శులు కిన్నెర వెంకన్న,గడ్డం వినోద్,మహిళా సంఘం నాయకు రాలు వుప్పుల పిచ్చమ్మ,మృతు రాలి కుమారులు అలుగూరి నారాయణ, అలుగూరి హరినాద్ బాబు,అలుగూరి గిరిబాబు,అల్లుడు మహేష్,గణేష్ పాల్గొన్నారు.