Listen to this article

కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలి వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు.

మార్చి 3 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో సోమవారం వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, పూనెం సాయి వెంకటాపురం మండల కేంద్రం లోని వ్యవసాయ కార్యాలయం లో కలిశారు. మొక్కజొన్న కంపెనీల పేరుతో ఆర్గనైజర్లు రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని రైతులను కోట్ల రూపాయలకు ముంచేసారని అవినాష్ వర్మ కి తెలిపారు. బాండ్ మొక్కజొన్న వ్యవసాయం అని చెప్పి రైతులకు కంపెనీ అగ్రిమెంట్స్ ఏమి ఇవ్వలేదనని అన్నారు. ఎకరానికి మూడు నుండి ఐదు టన్నులు దిగుబడి వస్తుందని నమ్మబలికి నట్లు వివరించారు. పంట దిగుబడి రాకపోతే కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులకు తెలిపినట్టు వ్యవసాయ అధికారికి తెలియజేసారు. గత పదిహేను రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. సింజెంట, హైటేక్, మోన్సెంట, సీపీ వంటి విదేశీ విత్తన కంపెనీల ఆర్గనైజర్ల పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు నిలదీశారు. ఆర్గనైజర్ల ఎరువుల దుకాణాలను తక్షణమే మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష యాభై వేలు, ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు కంపెనీ నుండి అందేలా చూడాలని వినతిపత్రం లో పేర్కొన్నట్టు తెలిపారు. రైతులు కంపెనీ మేనేజర్ల తో కలిపి సమవేషం ఏర్పాటు చేయాలని అన్నారు విచారణ పారదర్శకంగా జరపాలని రైతులకు న్యాయం చేయకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీ లను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసంచేస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేసారు మొక్కజొన్న రైతులపైన రాజకీయపార్టీల వైకారేంటని ప్రశ్నించారు ప్రజలను మోసం చేసిన ఆర్గానేజర్లను పార్టీ నుండి బహిస్కరించాలని డిమాండ్ చేసారు