Listen to this article

నాడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం…. నేడు శ్రమ ధానంతో రోడ్లు మరమ్మత్తులు..

జనం న్యూస్- ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గతంలో కొన్ని వార్డుల వీధులలో అంతర్గత సీసీ రోడ్లు వేసి  కొన్ని వీధులలో రోడ్డు పనులు పూర్తి  చేయకుండా వదిలివేయడతో వేసిన రోడ్లు ఎత్తు పెరిగిపోయి వేయని రోడ్డు ఎత్తు తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ మార్గం గుండా స్కూల్‌కి పిల్లలు వెళ్లాలన్న , పోస్ట్ ఆఫీస్ కు, ఆలయానికి వెళ్లాలన్న బస్సు కోసం బస్ స్టాప్ కి వెళ్లాలన్న ఇదే  ప్రధాన రహదారి కావడం అది కాస్తా పాడై పోవడంతో ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే స్థానికులు అనేక  ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కాలనీ అంతర్గత సిసి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత కొన్ని ప్రధాన రహదారులు, కూడళ్ళ వెంట ఉన్న పొడవైన, పెద్ద గుంతలు పూడ్చటంలో మున్సిపల్ సిబ్బంది, సదరు కాంట్రాక్టరు నాడు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంతో ఇప్పుడు స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రాత్రి పూట, వాహనదారులు, పాదచారులు రోడ్ల వెంబడి వెళ్ళాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందొ అనిభయపడుతున్నారు. స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా అప్పుడు, ఇప్పుడు అని కాలయాపన చేస్తున్నారేకాని పని మాత్రం జరగటం లేదు .అసలు ఒక బ్లాక్ లో రోడ్డు పూర్తయిన వెంటనే ఆ ఖాళీ ప్రదేశాలలో, సందులలో వెంటనే ప్రమాదాలు జరగకుండా మట్టితో నింపటం జరుగుతుంది. కానీ అలాంటి ప్రయత్నాలు ఇప్పటివరకు కొనసాగించక పోవటం శోచనీయం. ఇక ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లే సమయంలో అనేక సార్లు కింద పడి గాయాల పాలవటం బండ్లు చెడిపోవడం వంటి సందర్బాలు అనేకం. దీనితో పాదాచారులు, వాహనచోదకులు, పడుతున్న ఇబ్బందులను గుర్తించినస్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పే బ్యాక్ సోసైటీకి చెందిన మోసెస్,పుల్లారావు,రామదాసు,పెంచలరాజు,నకులరావు,వీరబాబు , తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్ ఓనర్ రామకృష్ణ సహకారంతో సోమవారం దెబ్బతిన్న రెండు ప్రధాన కూడళ్లలో స్వచ్ఛందంగా మొరం పోసి శ్రమదానం చేశారు దీనితో స్థానికులు వారిని అభినందించారు.