

జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జనం న్యూస్ మార్చి 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- సూర్యాపేట జిల్లా లో మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్మిడియేట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు,కోదాడలో 8, నడిగూడెం లో 2,హుజూర్నగర్ లో 2,మఠంపల్లి లో 1,నేరేడుచర్ల లో 1,తిరుమలగిరి లో 2,తుంగతుర్తి లో 2,ఆత్మకూరు (ఎస్ )మండలంలో 1 పరీక్ష కేంద్రం జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని అలాగే ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ఒక్క గంట ముందుగానే చేరుకోవాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సూచించారు.